Ardhika Shathakam

1. చేసిన తప్పులు దిద్దకపోతే
    డబ్బూ, సమయం వ్యర్థం వ్యర్థం
    కష్టం నష్టం పునరావృతం
    వినరా బాలకా! నరసింగరావ్ ఆర్ధిక సూచిక.

2. ఏమేమి చేసావో అవసరంలేదోయి
     ఏమేమి చేయాలో తెలుసుకోవాలోయి
     ఆర్థిక స్వాతంత్య్రం సొంతం చేసుకోవాలోయి
     వినరా బాలకా! నరసింగరావ్ ఆర్ధిక సూచిక.

3. స్వేచ్చ, సంపదలు కావు ఉచితాలు !
     సమష్టికృషి, సాధనలే మూల్యాలు,
     అంకితభావం, అభిరుచే ఆలంబనలు.
     వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక.

4. కొలువుతో జీవిత బంధనమా?
    పెట్టుబడితో సిరుల సౌఖ్యమా?
    భవితను మార్చుకో! బహు బాగుగా
    తెలివిగా తెలుసుకో బాలకా!
    నరసింగరావ్ ఆర్థిక సూచిక!

5. వ్యాపార, వ్యవహారమేదైనా డబ్బే ఆధారం
    తప్పవు తప్పులు, తిప్పలు కుప్పతెప్పలు
    తప్పొప్పుల నుంచి నేర్చుకో, తెలివిగా సంపాదించుకో
    తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక

6. కోరికలకు కాసులు కరువైనవా!
    రాబడి పెరిగినా చిల్లర చిక్కులు తీరవు నాయనా!
    ఖర్చులను కుదించుకో! చక్కని భవితకు పునాది వేసుకో!
    తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థికశతక సూచిక

7. జీతము పెరిగినంతనే కోరికలు పెరుగును,
    జీవితపు ఆశలు పెరుగును,
    విశ్వమే ఓ వ్యయపు మాయరా,
    వేతనముల తోటే వ్యయములెక్కువగురా,
    వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక

8. భద్రం, క్షేమం నీ లక్ష్యాలైతే,
    అష్ట లక్ష్ములే నీకు దూరం దూరం
    ఐశ్వర్య భాగ్యాలు నీ గమ్యాలైతే
    సులువుగా సాధించెదవు క్షేమం, భద్రం
    తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక

9. సిరి సాధనలో, సఫల ధ్యాసలేనివారి సావాసాలొద్దు
    అసూయా ద్వేషములు వారికి కద్దు
    వారి తప్పొప్పులు తెలుసుకో, సంపద సృష్టించుకో
    తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక

10. నీ తిప్పలకు కాదు అప్పులు కారణం,
      మోయలేని తప్పులకు వడ్డీ రణం,
      అధిక వడ్డీ చేయును నీ జీవితం దారుణం
      తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక

11. కేవలం కిస్తీ కడితే నీ అప్పు తీరునా?
      సంపద సృష్టి జరుగునా?
      శ్రమించి అధికంగా సంపాదించు,
      అప్పును పూర్తిగా తరిగించు
      వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక

12. మోయకురా చెడు ఋణం,
      అది చేయును నిను ధనలక్ష్మికి దూరం,
      ఎప్పటికి కాలేవు కుబేర సమానం.
      వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక.

13. చిత్రాల జగత్తు రా! సంపాదనంతా ఖర్చుపెట్టమనెరా!
      దాచుకొంటే చులకన చేసెరా! ఏదోటి కొనమని ఆజ్ఞాపించెరా!
      జీతం పెరిగినా జీవితం బాగుపడదురా! ఖర్చులెంతో పెరిగెనురా!
      తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక.

14. ఖాతాలో కాసు లేకున్నా,
      గడువుకు ఋణం తీరకున్నా,
      అరువుకు పోకన్నా!
      పోయి ఆపసోపాలు పడకన్నా!
      తెలివిగా మసులుకో బాలకా!
      ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక

15. నిత్యాదాయ వనరుకై, విలువ పెరుగు ఆస్తి కొరకై,
      అప్పు ఒప్పౌవును. నీ గౌరవమర్యాదలు కాలక్రమేణా పెరిగెను.
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

16. కార్డుతో కడితే ఖర్చులెక్కువాయెరా!
      నోట్లతో ఖర్చు, నొప్పి తెలిపెరా నీకు!
      వ్యయము తరిగెరా, నగదు నిలువ పెరిగెరా!
      వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

17. ఋణము చెల్లించుచూ, పొదుపు చేయువారు ఆర్థిక స్వేచ్ఛ పొందెన్
      దీర్ఘకాల రుణగ్రస్థులైననూ, పొదుపు పైకములు అధికంగా మిగిలెన్
      తాము తలపెట్టు ఘన కార్యములకు ప్రేరణగా నిలిచెన్
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక

18. అప్పు తీర్చుటకంటె ముందు, ఆర్థికంగా ఎదగాలోయి
      ఆర్థికంగా ఎదిగేందుకు నైపుణ్యాలుండాలోయి
      ప్రజ్ఞతో ఆదాయం పెంచి అప్పు తీర్చెయ్యాలోయి
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక

19. తరాలు మారినా తలరాతలు మారవు పాత పద్ధతులే పాటిస్తే,
      కాలంతో కాసుల కొలతలు మారును, చేతులుమారు తీరు మారును
      పరిశీలించు, పరిశోధించు, ఆర్థిక ప్రణాళిక తదనుగుణంగా అమలుపరుచు
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక

20. పన్నులు కుంచించుకో, వడ్డీలు తగ్గించుకో!
      మిగిలిన మొత్తాన్ని విశాలంగా విలాసాలకు వాడుకో,
      జీవన ప్రమాణాన్ని పెంచుకో, ఆర్థిక స్వేచ్ఛను సాధించుకో.
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

21. పన్నులు తరిగే రాబడి, పెట్టుబడులు పెంచుకో!
      ఆదాయ పన్నులు ప్రణాళికతో కుచించుకో!
      పన్నులెంత తరిగితే ఐశ్వర్యమంత పెరుగును తెలుసుకో!
      వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

22. స్వయంచాలక సముపార్జన, ఆదాయ వృద్ధి,
      పన్ను రహిత రాబడి, పరిమిత పన్నులు,
      తరుగుదల లెక్కింపు, తక్కువ వడ్డీలు
      ఐశ్వర్యానికి ఆరు సోపానాలు.
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

23. కాదోయి సిరి సంపదలు నడ మంత్రపు సిరులు.
      కాలం కలిసొస్తే కుబేర కరుణే కలుగెను కొన్నాళ్ళు.
      యోగ్యమైన జీవితమైనా, భాగ్యములైనా, నేర్పరలకే నిత్యములు.
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

24. అసాధ్యమగు ఆదాయ వ్యయ ప్రణాళికలు
      ఆచరించుటకై సలహా ఇచ్చే ఆర్ధిక నిపుణులు,
      వేల కొలది వాణిజ్య ప్రకటనలు, వ్యయ ప్రేరేపితములుండగా!
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

25. ఆహార పథ్యములెటునో వ్యయ ప్రణాళికలటునే.
      నియమ నిష్ఠలెన్నాళ్ళో, వ్యయ నిష్ఠలన్నాళ్లే.
      నిపుణులుపదేశించే వ్యయ నియంత్రణలు వ్యర్థాలే .
      వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

26. ఆచరణకు నోచుకోని ఆర్థిక ప్రణాళికలైనా వ్యూహాలైనా
       స్వయంచాలక చెల్లింపుల చేతనే ఎదరకు సాగెను
       క్రమశిక్షణలో మేటివారైనా యాంత్రిక చెల్లింపులే ఎంచెను.
       తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

27. సచిన్, సానియా, సైనాలకైనా, నీకైనా, నాకైనా
      ఆర్థిక ప్రగతి సమీక్షకై, స్వాతంత్య్ర సాధనకై,
      మార్గదర్శకులే ముఖ్యులు మార్గ నిర్దేశముకై
      వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. సూచిక.

28. విలువ తరిగినపుడు పెరిగినపుడు, కొని అమ్ముట,
      ఐశ్వర్య సాధనకు మర్మము కాదట.
      మూలధన వృద్ధి, నిత్యాదాయాలే మూలమట.
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

29. నరసింగరావు ఆర్థిక భవిష్యత్ సూచికలు

       పరిమితార్జన,
       మిక్కిలి వ్యయమైతే,
       దివాలా

      పరిమితార్జన, వ్యయం,
      మిక్కిలి పొదుపైతే,
      ధనం నిశ్చలం

      పరిమితార్జన, వ్యయం
      మిక్కిలి పొదుపు, ఆదాయాలతో,
      ధనం పదిలం

      ద్వియార్జన, పరిమిత వ్యయం,
      మిక్కిలి పొదుపు, ఆదాయాలతో,
      ఆర్థిక స్వాతంత్య్రం

      అనేకార్జన, పరిమిత వ్యయం,
      మిక్కిలి పొదుపు, పెట్టుబడి, ఆదాయాలతో
      సంపూర్ణ సమయ స్వేచ్ఛ, విమోచనం

      అనేకార్జన, పెట్టుబడి లేని రాబడి, పరిమిత వ్యయం, పన్నులు,
      మిక్కిలి పొదుపు, పెట్టుబడి, ఆదాయాలతో
      ధనం ధారాళం

30. అనేకులు అరువు అనర్ధమని ఆలోచించే!
      అనర్థము అరువు కాదురా,
      బాధ్యత, ఆర్థిక విద్యల లేమే హానికరమురా!
      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

31. అప్పు ప్రపంచ వృద్ధికై సహాయపడె, జీవనశైలి మెరుగుకై తోడ్పడె.       ధరించు దుస్తులు, భుజించు భోజనము, స్వగృహ సాధన, జీవన రీతులు,       పరపతి, రుణముల ఫలములే, తప్పించెను ఎన్నో విలవిలలే.       వినుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

32. వ్యక్తిగత, వాహన, పరపతి ఋణములు,
      ఎందుకూ కొరగాని అరువులు.
      పొందుట సరళము సులభము

      గృహ, వ్యాపారాది, ఆస్తి అరువులు
      లాభదాయక సార్థక ఋణములు
      పొందుట క్లిష్టము, కఠినము

      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

33. పైకము పొదుపు చేయువాడు పదిలంగ మాత్రమే ఉండు.
       సంపద నిర్వహించువాడు సౌభాగ్యవంతుడగు.
       లెక్కించి తెగించువాడు, పరపతినుపయోగించు, ఐశ్వర్యం సంపాదించు.
       తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

34. అప్పు తీర్చుటకు తొందరొద్దురా.
       కిస్తీ కట్టగా మిగిలినది మదుపు చేయరా,
       నైపుణ్యం నేర్వరా, ఆదాయం అభివృద్ధి చేయరా.
       హెచ్చిన వచ్చుబడితో బాకీ తీర్చివేయరా.
       వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

35. ప్రాచీన పద్ధతులు, మౌలిక విలువలు,
       ఆధునిక వాస్తవాలు, యాంత్రికీకరణాలతో
       లభించే భాగ్యము, బ్యాంకులో డబ్బులు,
       ఆస్తుల ఆదాయం, ఆనంద బాంధవ్యాలు.
       తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

36. విశ్వసనియత వేరు, అరువుకుండే అవకాశం వేరు.
      రుణ పరిమితి అరువు,
      విడత విడతకు పెరిగే పరిమితి విశ్వసనియత.
      అరువు తీర్చుటకు చిత్తశుద్ధి, క్రమశిక్షణే విశ్వసనియత.
      వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

37. విశ్వసనియత వేరు,
      అరువుకుండే అవకాశం వేరు.

      అవసరానికి అదనపు మొత్తం,
      అరువు తేగల దక్షతే విశ్వసనియత.

      అది నిర్మితమౌను,
      మాట నిలుపుకోవడం వలనే
      ఆర్థిక స్థితి ఎట్లున్ననూ.

      తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

38. ఆర్థిక నియమాలైనా, పద్ధతులైనా, తలపులైనా
       పనిచేయవలె ఎప్పుడైనా, నీ కాలం బాగున్నా లేకున్నా,
       ఆర్థికవ్యవస్థ అద్భుతమైనా అస్తవ్యస్తమైనా.
       లేకుంటే నీ జీవితమంతా ఆర్ధిక సంకటములే.
       తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక.

To be continued

Special thanks to Srinivas B

Scroll to Top