S No | పద్యం | Thought | భావం/సందర్భం |
---|---|---|---|
1 | చేసిన తప్పులు దిద్దకపోతే డబ్బూ, సమయం వ్యర్థం వ్యర్థం కష్టం నష్టం పునరావృతం వినరా బాలకా! నరసింగరావ్ ఆర్ధిక సూచిక. |
Past financial mistakes Will continue your future, If u dont trim them and drag along with you! |
|
2 | ఏమేమి చేసావో అవసరంలేదోయి ఏమేమి చేయాలో తెలుసుకోవాలోయి ఆర్థిక స్వాతంత్య్రం సొంతం చేసుకోవాలోయి వినరా బాలకా! నరసింగరావ్ ఆర్ధిక సూచిక. |
Its not what you’ve Been doing so far, What u do from now on, Will help you achieve time and financial freedom. |
|
3 | స్వేచ్చ, సంపదలు కావు ఉచితాలు ! సమష్టికృషి, సాధనలే మూల్యాలు, అంకితభావం, అభిరుచే ఆలంబనలు వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Time and financial freedoms cannot be leased or rented You must purchase them Passion, knowledge,skill, teamwork and dedication are the costs |
|
4 | వ్యాపార, వ్యవహారమేదైనా డబ్బే ఆధారం తప్పవు తప్పులు, తిప్పలు కుప్పతెప్పలు తప్పొప్పుల నుంచి నేర్చుకో, తెలివిగా సంపాదించుకో తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Everyone makes financial mistakes, The dumbsticks with them, The smart learn from them and build wealth. |
|
5 | సిరి సాధనలో, సఫల ధ్యాసలేనివారి సావాసాలొద్దు అసూయా ద్వేషములు వారికి కద్దు వారి తప్పొప్పులు తెలుసుకో, సంపద సృష్టించుకో తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచి |
If you want to have a successful Financial life, dont be with or Listen to people who cant They may lower themselves to Your level to feel better about themselves Instead, listen,analyze, and learn from their mist |
|
6 | తరాలు మారినా తలరాతలు మారవు పాత పద్ధతులే పాటిస్తే, కాలంతో కాసుల కొలతలు మారును, చేతులుమారు తీరు మారును పరిశీలించు, పరిశోధించు, ఆర్థిక ప్రణాళిక తదనుగుణంగా అమలుపరుచు తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Traditional methods or rules do not Always work in financial planning As generations transform, money game Rules and flows change research , analyze, and act accordingly |
|
7 | పైకము పొదుపు చేయువాడు పదిలంగ మాత్రమే ఉండు. సంపద నిర్వహించువాడు సౌభాగ్యవంతుడగు. లెక్కించి తెగించువాడు, పరపతినుపయోగించు, ఐశ్వర్యం సంపాదించు. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Money is made by managing it, Not by saving it. Saving money may protect you Managing money makes wealth for you Savers never become rich Start taking calculated risks,and average To get rich and wealthy. |
|
8 | కొలువుతో జీవిత బంధనమా? పెట్టుబడితో సిరుల సౌఖ్యమా? భవితను మార్చుకో! బహు బాగుగా తెలివిగా తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక! |
Salary to salary competition that keeps in rate race and prevents in financial freedom Opportunities to accumulate money and wealth by investing in businesses and assets |
|
9 | జీతము పెరిగినంతనే కోరికలు పెరుగును, జీవితపు ఆశలు పెరుగును, విశ్వమే ఓ వ్యయపు మాయరా, వేతనముల తోటే వ్యయములెక్కువగురా, వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక |
We are taught conditioned and forced to spend all earnings without saving any of it A pay raise psychologically means that we have more to spend This, in turn, leads to even more spending that we earn |
|
10 | ప్రాచీన పద్ధతులు, మౌలిక విలువలు, ఆధునిక వాస్తవాలు, యాంత్రికీకరణాలతో లభించే భాగ్యము, బ్యాంకులో డబ్బులు, ఆస్తుల ఆదాయం, ఆనంద బాంధవ్యాలు. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Old principles + core values+new facts + automation= wealth held + money in bank + income from assets+happy relationships | |
11 | ఆర్థిక నియమాలైనా, పద్ధతులైనా, తలపులైనా పనిచేయవలె ఎప్పుడైనా, నీ కాలం బాగున్నా లేకున్నా, ఆర్థికవ్యవస్థ అద్భుతమైనా అస్తవ్యస్తమైనా. లేకుంటే నీ జీవితమంతా ఆర్ధిక సంకటములే. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Your financial principles, thoughts and process should work in good and bad times of life, economy and investments Otherwise you will be in financial troubles for major part of life. |
|
12 | మీ ఆర్ధిక వర్తమానం గతకాల నిర్ణయాల ఫలితం. మారని చేతలతో పర్యవసానం పునరావృతం. తీరు మారవలెననిన, ఉండవలె ఆర్ధిక దార్శనీకులై నిర్భయంగా ప్రయత్నించి నిలిచెను కొందరే విజేతలై. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Your current financial status is the result of all decisions made till now If you keep doing the same tasks you will get the same results If you like where you arekeep it up Else migrate to financial vision board Only few have the courage to seek the change |
Programming |
13 | బ్యాంకుల, ఆర్ధిక సంస్థల సహకారంతో, బహు బాగుగా భోదించెను స్వయం ప్రకటిత ఆర్ధిక విధానం. చేసెను చందాదారులుగా, ఖాతాదారులుగా మనలను వారి ఉత్పత్తి, సేవలకై వ్యాపార సంస్థలు. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
All businesses in coordination with banking and financial services industry, Is very good in preaching and teaching their way of handling money, This ultimately, leads us to subscribe their services and products. |
|
14 | భాగ్యము కావలె, ఆరోగ్యము కావలె ఎందరికో, కష్టములైనా, నష్టములైనా పడుటటుకు మనసొప్పదే వాటికై. పైకము, ప్రవీణత, ప్రయత్నము, కాలము వెచ్చించవలె కావల్సిన ఫలములకై. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Many want to be healthy and wealthy with no efforts or risk. It will never happen Skill effort time and money has to be paid cost to achieve the desired result There are no shortcuts. | |
15 | తెలుసుకో విచక్షణతో, తెగింపుతో నష్టములేమిటో, తెగింపులేమితో నష్టములేమిటో. పైకములు ఎటు పోవునో భవిత ఎటు సాగెనోనని ఎరుగక, ముదుపు చేయుటకు, మదుపు నష్టములకు భయపడెదరు ఎందరో. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక | Reward yourself because you are the only 1 who cares for you Recognizing yourself makes you feel self worth. Your best investment is yourself, Keep yourself motivated with small and frequent rewards Spend 20%of income pampering, glowing and growing yourself. YOLO | |
16 | దృఢ సంకల్పం, కాకతో కూడిన కాంక్ష, భవిష్యత్పై నమ్మిక, రవ్వంత త్యాగం, కేంద్రీకృత తీక్ష్ణత, జాగురూక వ్యయ ప్రణాళిక, ప్రాథమిక, కీలక మూలములు సిరికై, భాగ్యమునకై. ఆవశ్యకమైన మౌలిక కొలబద్ద కేంద్రీకృత తీక్షతే కార్యసిద్ధికై. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
The fundamental and critical elements of getting rich and wealthy are:-
A conscious spending plan. A burning desire A strong determination Belief in the future A little sacrifice with A focused intensity Focused intensity is the most important core parameter for success |
|
17 | హేతుబద్ధ నిర్ణయాలు తీసుకొందుమని భావించెదెము మనము. పర్యవసానాల సంభావ్యతపై మన ప్రాధాన్యముల మేఘములు కమ్మెను కానీ. ఫలములపై సంశయం, హామీ లేనప్పుడు తప్పులు చేసెదెము అందరము. భయం, దురాశ, అనిశ్చితి, ఆశ, పరిమితులు చేసెను తీర్మాన ప్రక్రియను క్లిష్టతరం. తెలిసి మసులుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
We assume we make rational decision, but our preferences clouds possibilities Self interest, uncertainty,constraints, hope, fear,greed complicates decision making When probabilities of outcomes are not guarantee and fixed, we are pone to make mistakes. |
|
S No | పద్యం | Thought | భావం/సందర్భం | 1 | కోరికలకు కాసులు కరువైనవా! రాబడి పెరిగినా చిల్లర చిక్కులు తీరవు నాయనా! ఖర్చులను కుదించుకో! చక్కని భవితకు పునాది వేసుకో! తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థికశతక సూచిక |
most think all money problems Would vanish, if income doubles It will not happen Income is never too small. It's that our money out go is too biggg |
---|---|---|---|
2 | చిత్రాల జగత్తు రా! సంపాదనంతా ఖర్చుపెట్టమనెరా! దాచుకొంటే చులకన చేసెరా! ఏదోటి కొనమని ఆజ్ఞాపించెరా! జీతం పెరిగినా జీవితం బాగుపడదురా! ఖర్చులెంతో పెరిగెనురా! తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
We are taught conditioned, And forced to spend all earnings Without saving any of it. A pay raise psychologically means That we have more to spend. This , in turn,leads to even More spending that we earn. |
|
3 | ఖాతాలో కాసు లేకున్నా, గడువుకు ఋణం తీరకున్నా, అరువుకు పోకన్నా! పోయి ఆపసోపాలు పడకన్నా! తెలివిగా మసులుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
If you do not have enough money In your savings or If you won't be able to pay the Full amount in the same billing cycle. You should not buy on credit card |
|
4 | కార్డుతో కడితే ఖర్చులెక్కువాయెరా! నోట్లతో ఖర్చు, నొప్పి తెలిపెరా నీకు! వ్యయము తరిగెరా, నగదు నిలువ పెరిగెరా! వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
If you pay with cash or a debit card Rather than a credit card, You are more likely to spend less. |
|
5 | ఋణము చెల్లించుచూ, పొదుపు చేయువారు ఆర్థిక స్వేచ్ఛ పొందెన్ దీర్ఘకాల రుణగ్రస్థులైననూ, పొదుపు పైకములు అధికంగా మిగిలెన్ తాము తలపెట్టు ఘన కార్యములకు ప్రేరణగా నిలిచెన్ తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Never stop saving to repay debt Delaying savings will always delay financial freedom Do both simultaneously, Saving for financial freedom and getting rid of debt. This may prolong debt repayment, But it gives higher amount at the end And keeps motivation up. |
S No | పద్యం | Thought | భావం/సందర్భం | 1 |
నీ తిప్పలకు కాదు అప్పులు కారణం, మోయలేని తప్పులకు వడ్డీ రణం, అధిక వడ్డీ చేయును నీ జీవితం దారుణం తెలుసుకో బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక |
It's not the outstanding loan Amount or bad debt that kills But the monthly interest is! The higher the rate of interest, the higher the chance to get screwed. |
---|---|---|---|
2 | మోయకురా చెడు ఋణం, అది చేయును నిను ధనలక్ష్మికి దూరం, ఎప్పటికి కాలేవు కుబేర సమానం. వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Carrying bad debts, credit card outstanding, Personal loans,consumer loans, And vehicle loans Can never make you rich. |
|
3 |
నిత్యాదాయ వనరుకై, విలువ పెరుగు ఆస్తి కొరకై, అప్పు ఒప్పౌవును. నీ గౌరవమర్యాదలు కాలక్రమేణా పెరిగెను. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Borrowing money is only Appropriate when the loan can be Converted into an income-generating Or appreciating asset in the long run |
|
4 |
అప్పు తీర్చుటకంటె ముందు, ఆర్థికంగా ఎదగాలోయి ఆర్థికంగా ఎదిగేందుకు నైపుణ్యాలుండాలోయి ప్రజ్ఞతో ఆదాయం పెంచి అప్పు తీర్చెయ్యాలోయి తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Companies borrow money and don't focus on repaying loans Companies use debt to expand business and increase revenues The increased revenues are used to repay debt Similarly, instead of focusing solely on repaying loans Focus on improving skill, increasing income and repay loans |
|
5 | అప్పు తీర్చుటకు తొందరొద్దురా. కిస్తీ కట్టగా మిగిలినది మదుపు చేయరా, నైపుణ్యం నేర్వరా, ఆదాయం అభివృద్ధి చేయరా. హెచ్చిన వచ్చుబడితో బాకీ తీర్చివేయరా. వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Don't clear debt Instead put that money to increase income either in a course or investment or asset which can multiply income. Use that income or inflow to repay the loan interest and principal |
|
6 | విశ్వసనియత వేరు, అరువుకుండే అవకాశం వేరు. రుణ పరిమితి అరువు, విడత విడతకు పెరిగే పరిమితి విశ్వసనియత. అరువు తీర్చుటకు చిత్తశుద్ధి, క్రమశిక్షణే విశ్వసనియత. వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Credit and credibility are different Having credit limit is your credit, ability to increase credit limit over a period of time is credibility Credit + integrity +discipline= credibility |
S No | పద్యం | Thought | భావం/సందర్భం | 1 |
పన్నులు కుంచించుకో, వడ్డీలు తగ్గించుకో! మిగిలిన మొత్తాన్ని విశాలంగా విలాసాలకు వాడుకో, జీవన ప్రమాణాన్ని పెంచుకో, ఆర్థిక స్వేచ్ఛను సాధించుకో. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Paying taxes and interest first, Will never make you rich Plan to reduce taxes and interest payments Use reduced taxes and interest payments to plan Luxury, lifestyle, time and money freedom |
---|---|---|---|
2 | పన్నులు తరిగే రాబడి, పెట్టుబడులు పెంచుకో! ఆదాయ పన్నులు ప్రణాళికతో కుచించుకో! పన్నులెంత తరిగితే ఐశ్వర్యమంత పెరుగును తెలుసుకో! వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
The lower your personal income tax rate, The greater the chance to becoming wealthy Plan and reduce your taxes Aim for tax deductible, lowering, exempted investments and incomes |
|
3 |
వేతనంలో అధిక భాగం పన్ను కోతలా ? కోత పడిన వేతనం వాపస్కు ఏడాదిపాటు ఎదురుచూపులా ? సున్నా వడ్డీతో సర్కారుకి మీరు రుణమివ్వాలా ? కట్టవలె పన్నులు మీరు శీఘ్రముగా , తగ్గించవకోవలె కుదించకోవలె వాటిని ప్రణాళికతో యుక్తిగా, తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
If you are paying huge TDS from salary or getting a big tax refund next year, then you have allowed the government to use your money interest free for one year Pay tax promptly, but plan,reduce and pay less tax. |
|
S No | పద్యం | Thought | భావం/సందర్భం | 1 |
కాదోయి సిరి సంపదలు నడ మంత్రపు సిరులు. కాలం కలిసొస్తే కుబేర కరుణే కలుగెను కొన్నాళ్ళు. యోగ్యమైన జీవితమైనా, భాగ్యములైనా, నేర్పరలకే నిత్యములు. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
You know
Good things and richness dont happen accidentally Sometimes luck may favor few people occassionally and they win jackpots Good life and rich things happen to Those who make things happen. |
---|---|---|---|
2 | అసాధ్యమగు ఆదాయ వ్యయ ప్రణాళికలు ఆచరించుటకై సలహా ఇచ్చే ఆర్ధిక నిపుణులు, వేల కొలది వాణిజ్య ప్రకటనలు, వ్యయ ప్రేరేపితములుండగా! తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Financial experts advise Making and sticking to a budget. Budgets never wok We are bombarded with thousands of ads, Persuading us to spend money. |
|
3 |
ఆహార పథ్యములెటునో వ్యయ ప్రణాళికలటునే. నియమ నిష్ఠలెన్నాళ్ళో, వ్యయ నిష్ఠలన్నాళ్లే. నిపుణులుపదేశించే వ్యయ నియంత్రణలు వ్యర్థాలే . వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Financial advisors ask to prepare and stick to budget, but it never works Budgets can be compared to diets, which may be initially followed for few days But, people will eventually go back to eating and spending what they want |
|
4 | ఆచరణకు నోచుకోని ఆర్థిక ప్రణాళికలైనా వ్యూహాలైనా స్వయంచాలక చెల్లింపుల చేతనే ఎదరకు సాగెను క్రమశిక్షణలో మేటివారైనా యాంత్రిక చెల్లింపులే ఎంచెను. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Financial plans and roadmaps work only if they are automated instead of manual execution Even the most disciplined people in the world see financial transactions automation. As mandatory instead of an optional task. |
|
5 | ఆర్థిక విజ్ఞాన ఖని అరచేతిలో వున్నా, ఏం చెయ్యాలో తెలిసినా, చెయ్యాల్సింది చేసేనా? అందరూ జ్ఞానులే కానీ, అధిక శాతం నిచ్చేష్టులే కదా! తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Gigabytes and terabytes of financial information is available online Most of us what to do Hence, what has to be done is never a problem Execution is not done by many Most of us know,what to do But we just dont do it |
|
6 | స్వయంచాలక సముపార్జన, ఆదాయ వృద్ధి, పన్ను రహిత రాబడి, పరిమిత పన్నులు, తరుగుదల లెక్కింపు, తక్కువ వడ్డీలు ఐశ్వర్యానికి ఆరు సోపానాలు. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
6 ways to get rich Increase your income Obtain tax free income Pay less interest Pay fewer taxes Get depreciation benefit Automate the earning process |
|
7 |
దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్యములు, వైకల్యములు కలుగుట, ప్రియమైన వారు పరమపదించుట లేక వదిలి వెళ్ళుట, జీవితములను చెరుపును, ప్రతికూలముగా మార్చెను. ఎదుర్కొనుటకు ఎల్లప్పుడూ, చేసుకోవలెను ఒక ఏర్పాటు! తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Top 5 most damaging and life changing negative events are:- Severe sickness Prolonged illness Disability Loss of loved one Quitting of major partner |
|
8 | భాగస్వామితో భేదములున్నచో ఉండదు భాగ్యము, ఉండవలే ప్రణాళికలపై భాగస్వామితో ఏకీభావము, తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. భార్య భర్తలే నిబంధనలకు అధిపతులు, రాసిన పిదప ఒప్పందములే అధికృతములు, ఏమైననూ మీరవలదు ఒడంబడికలు ! తెలిసి మసులుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Above paper is the boss for spending ,and you bothare the boss of what should go into the document. |
|
9 | 2 major reasons for not having progress in financial status. Not taking calculated and measured risks in the name of safety Expecting quick results and speed money without financial education. |
||
10 | నష్ట భయం వల్ల అచేతన ఫలితము, ఎదురొడ్డిన వచ్చు ఫలములను భేరీజు వేసుకో! శ్రమింపచేయవలె సిరిని ఎల్లప్పుడూ మీకొరకు. వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
Saving without a financial goal is trash Make money work for you, instead of keeping idle. Learn about the risks of not taking risk Risk of taking risk |
|
11 | ఆర్థిక సమస్యలు వ్యయము వల్ల కాదు, ఆదాయలేమి వల్లరా. పొదుపు పెంచదురా సంపద! అధిక సంపాదన, మదుపులే కీలకంరా. ఆదాయ వృద్ధికి నీ నైపుణ్యాలు నవీకరించాలిరా. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
To have more money, many believe, should save more. While making and investing more will give more, so first plan to earn more. Most dont try to upgrade their skills to make more income. The real problem lies in lack of income and not in spending |
S No | పద్యం | Thought | భావం/సందర్భం | 1 |
అనేకులు అరువు అనర్ధమని ఆలోచించే! అనర్థము అరువు కాదురా, బాధ్యత, ఆర్థిక విద్యల లేమే హానికరమురా! తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Many people think loans, debts and credits are bad and should be ridden In fact, loans, credit and debits Are not bad lack of responsibility and Financial education is bad. |
---|---|---|---|
2 | అప్పు ప్రపంచ వృద్ధికై సహాయపడె, జీవనశైలి మెరుగుకై తోడ్పడె. ధరించు దుస్తులు, భుజించు భోజనము, స్వగృహ సాధన, జీవన రీతులు, పరపతి, రుణముల ఫలములే, తప్పించెను ఎన్నో విలవిలలే. వినుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Loans and credit have helped the world, To grow and improve standards of life Clothes we wear, Food we eat, Homes we stay, Lifestyle we live, Are result of loans and credit |
|
3 |
కేవలం కిస్తీ కడితే నీ అప్పు తీరునా? సంపద సృష్టి జరుగునా? శ్రమించి అధికంగా సంపాదించు, అప్పును పూర్తిగా తరిగించు వినరా బాలకా! నరసింగరావ్ ఆర్థిక సూచిక |
If you continue to pay the minimum due each month, You will never get out of debt or become financially successful. |
|
4 | మంచి రుణములు వేయును బంగారు భవితకు దారులు చెడ్డ రుణములు కల్గించును అవరోధములు. మంచి అప్పు తప్పు కాదురా, నీ దశను ఉత్తమంగా తిప్పురా ఆర్థిక విజయమైనా, పతనమైనా నీవు చేయు రుణమే నిర్ణేతరా తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక | A major barrier to succeed or win a financial battle is having bad debt. Some people who experienced weird and ridiculous instances might have decided not to borrow any more in their lifetime. Use good debt to get rich. |
|
5 | రెండు వైపులా పదునున్న కత్తులు రుణ పరపతులు. భద్రముగ వాడితే కల్గును భాగ్యములు. ఆదమరిచిన వ్యసనమలగు, ఆపదలగు. ఉపద్రవములగు ఆరోగ్యముకు, ఐశ్వర్యముకు. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
loans/ leverage/debt opm is a double edge tool and should be used carefully to create prosperity It is addictive and adds considerable risk, if not used properly, it is injurious to health and health. |
S No | పద్యం | Thought | భావం/సందర్భం |
---|---|---|---|
1 |
చెలికాండ్రు, చుట్టరికములకు అరువు ఉపకారమవ్వదు. అది చెఱుపునేమో బాంధవ్యములను. సంతోషమే ఇరువురికీ సమయానికి చెల్లించినచో. సొమ్ములు అందనిచో, సంకటమే ఇద్దరికీ, మారెను బాంధవ్యములు దొర, దాస బంధములుగా! మైత్రీ, సంబంధీకులకు శ్రేష్ఠములు వదలుకోగల రుణములే! తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
By lending to friends or relatives we are not helping them. We are likely to strain or destroy relationships. If the other person repays on time , both are happy,else, slave and master feeling may come to picture help/lend an amount which may forgo and doesn't impact the relationship. |
|
2 | కృషితో, శ్రమతో, శ్రద్ధతో, కలిసి సృష్టించెను సంపదను భార్యాభర్తలు. జగడముల జంటలు జతగా సృష్టించెను దారిద్య్రములు. వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Family members, particularly wives and husbands ,
who care for, work, and endeavor together creative health While a wife and husband who fight create poverty together. |
|
3 |
కుటుంబమైనా, స్నేహితులైనా, సహోద్యుగులైనా వ్యతిరేకము కాదే నీ వ్యయములకు, భోగములకు. విరుద్ధమల్లా నీ ఖర్చులు, ఆర్జనల హద్దులు దాటినప్పుడే వినరా బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక |
None of your family members or colleagues or friends will be against the enjoyment of money. All will be against the thought of spending money when you dont have money or can't make money. |
|
S No | పద్యం | Thought | భావం/సందర్భం |
---|---|---|---|
1 |
పొదుపు మదుపు చేయనివారు ఈ ప్రొద్దు, ఆదాయ వృద్ధితో కూడబెట్టవలె అధికంగా . ఆదాయ, వ్యయ, పొదుపుల యాంత్రీకరణ చేసెను మీకు, ఘనమైన ఆర్థిక మేలును. చేతికొచ్చు వేతనం తరగకుండా భవిష్యత్ బాగుండునీ ఎంపికతో. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Those who do not want to save or invest today should consider saving more tomorrow This option allows them to contribute more to a better financial future as their income grows. Saving more will not reduce your take home salary Automation of income, savings and expenses required to reap the greatest benefits. |
|
2 |
అడ్డుకాదు నిత్యార్జనకు అధిక వ్యయ, సుంకములు. నష్టాలు తగు నివారణలతో తగ్గించి, అనుకూల పరిస్థితులకు వేచి, నిత్యము లాభాలు తీసుకొన్న, వచ్చును ఆదాయములు దీర్ఘకాలమున. తెలుసుకో బాలకా! ఇది నరసింగరావ్ ఆర్థిక సూచిక. |
Don't blame costs and taxes as major reason for not making money
from investments. There are people who make money when costs are 10times higher. Today the cost of the transaction is almost near to 0, but 90% lose money. Positive edge, hedge,holding winners, cutting losers booking profits regularly,makes money in the long run. |